Ad Code

Responsive Advertisement

Ticker

6/recent/ticker-posts

ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

నెల్లూరు జిల్లా కృష్ణ పట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్‌) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇది ఇలా ఉండగా ఈ రోజు హైకోర్టు ఆనందయ్యా మందు మీద తీర్పు వెలురించనుంది.
ప్రభుత్వం నుండి అనుమతి లభించిన నేపధ్యం లో ఆనందయ్య మందు పంపిణీకి సిద్దం అయ్యే అవకాశం ఉంది.


కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. అవి రావడానికి 2- 3 వారాలు సమయం పడుతుందని వివరించింది. కె అనే మందును కమిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్ఏఎస్ దీనికి నిరాకరించింది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి.

ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఆనందయ్య ఇచ్చే పి, ఎల్‌, ఎఫ్ మందులు వాడొచ్చని స్పష్టం చేసింది

Post a Comment

0 Comments

Ad Code

Responsive Advertisement